ఆరు బంతులు…ఆరు సిక్సులు.. అంటే ఠక్కున గుర్తొచ్చేది యువరాజే.ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరూ ఇలా కొట్టలేదు. కానీ ఇప్పుడు అలాంటి సీన్‌నే ఇంగ్లాండ్ కౌంటీ క్రికెటర్ రాస్ విట్లే రిపీట్ చేశాడు.నాట్‌వెస్ట్ టీ20 లీగ్‌లో భాగంగా ఆదివారం యోర్క్‌షైర్ టీమ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో అతడు రికార్డ్ సాధించాడు. 37 పరుగులతో మ్యాచ్ ఓడిపోయినా రాస్ విట్లే ఇన్నింగ్స్ మాత్రం గుర్తుండిపోయేలా చేశాడు.