Rowan was struck by lightning while at home
mictv telugu

ఇంట్లో ఉండగా వ్యక్తిపై పడ్డ పిడుగు.. ఎలా సాధ్యమో వివరించిన డాక్టర్లు

September 19, 2022

Rowan was struck by lightning while at home

భారీ తుఫానులు వచ్చే సమయంలో పిడుగులు పడడం సాధారణంగా మనం చూస్తుంటాం. అలాంటప్పుడు రక్షణ కోసం ఎవరైనా ఇంట్లోకి వెళ్లిపోతారు. కానీ, ఇంట్లో ఉన్నా కూడా పిడుగు పడితుందని నిరూపించే సంఘటన యూకేలో జరిగింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగానే జరిగింది. తర్వాత అది ఎలా సాధ్యమో డాక్టర్లు స్పష్టంగా కుటుంబసభ్యులకు వివరించారు.

ఆసక్తికరంగా ఉన్న ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్ షైర్ ప్రాంతంలో నివసించే ఎయిడెన్ రోవన్ తన ఇంటి లివింగ్ రూంలో కూర్చొని ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నాడు. ఇంతలో సడెన్‌గా కొద్ది దూరంలో పిడుగు పడింది. దాంతో రోవన్ శరీరం బరువెక్కసాగింది. శరీరం కాలిపోతున్నట్టనిపించడంతో రోవన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రోవన్‌పై పిడుగు పడిందని తేల్చారు. అయితే ఆ సమయంలో ఇంట్లో ఉన్నానని రోవన్ చెప్పగా, పిడుగు ఎలా పడిందో డాక్టర్లు వివరించారు. బయట నీళ్లపై పడ్డ పిడుగు రిఫ్లెక్ట్ అయి అక్కడ్నుంచి డైవర్షన్ తీసుకొని కిటికీ గుండా ఇంట్లోకి ప్రవేశించి రోవన్‌కు తగిలిందని చెప్పారు. దాంతో ఇలా కూడా సాధ్యమవుతుందా అని నోరెళ్లబెట్టారు. రోవన్ కుడిచేతిపై కాలిన గాయాలు అందుకు సాక్ష్యమని డాక్టర్లు చూపెడుతున్నారు. సో, మీరు కూడా పిడుగు పడే సమయాల్లో తలుపులు, కిటికీలు వేసుకోవడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.