బిగ్‌బాస్ 5 విన్నర్ వీజే సన్నీపై దాడి జరిగింది. హైదరాబాద్‌లోని హస్తినాపురం ప్రాంతంలో ఓ రౌడీ షీటర్ సన్నీపై దాడికి పాల్పడ్డాడు. సన్నీ సినిమా షూటింగ్లో ఉన్న సమయంలో రౌడీ షీటర్ అక్కడికి వెళ్లి దాడి చేశాడు. చిత్ర యూనిట్ రౌడీ షీటర్‌ను అడ్డుకుని సన్నీని అక్కడినుంచి పంపించేశారు. చిత్ర యూనిట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని రౌడీ షీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
వీజే సన్నీ ప్రస్తుతం ‘ఏటీఎం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. బుధవారం రాత్రి (జూన్ 8) సన్నీ సెట్లో ఉండగా ఓ రౌడీ షీటర్ వచ్చి అతనితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో దాడికి పాల్పడ్డాడు. కాగా విజేగా కెరీర్ స్టార్ట్ చేసిన సన్నీ పలు టీవీ షోలు, సీరియల్స్‌తో గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో పాల్గొనే ఆఫర్ కొట్టేశాడు. ఈ షో తనదైన ప్రవర్తనతో బుల్లితెర ప్రేక్షకుల హృదయానలు గెలుచుకున్న సన్నీ బిగ్‌బాస్ సీజన్ 5 విజేతగా నిలిచి టైటిల్ అందుకున్నాడు.