ఐపీఎల్‌లో తొలిసారి..బెంగళూరు టీమ్‌లోకి లేడీ థెరపిస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఐపీఎల్‌లో తొలిసారి..బెంగళూరు టీమ్‌లోకి లేడీ థెరపిస్ట్

October 18, 2019

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు సపోర్ట్ స్టాఫ్‌లోకి ఓ మహిళా మసాజ్ థెరపిస్ట్‌ని తీసుకుంది. 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఓ జట్టు యాజమాన్యం మహిళని టీమ్‌లోకి తీసుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 

ఐపీఎల్ 2020 సీజన్ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ టైమ్‌లో బెంగళూరు టీమ్‌తో మహిళా థెరపిస్ట్ నవనీత గౌతమ్ ఉండనున్నట్లు ఆర్సీబి ట్విట్టర్‌లో ప్రకటించింది. టోర్నీలో వరుస మ్యాచ్‌ల కారణంగా ఆటగాళ్లు అలసిపోనుండగా.. వారి శరీరం, కండరాలకి మసాజ్ చేయడం థెరపిస్ట్ ప్రధాన కర్తవ్యం. ఈ పని చేయడానికి మిగతా జట్లు పురుషులను తీసుకోగా..బెంగళూరు జట్టు మాత్రం అందుకు భిన్నంగా మహిళను తీసుకుంది. ఐపీఎల్‌లో ఇప్పటికే 12 సీజన్లు ముగియగా.. కనీసం ఒక్కసారి కూడా బెంగళూరు జట్టు టోర్నీ గెలవలేదు. దీంతో వచ్చే ఏడాది చాలా మార్పులతో ఆ జట్టు బరిలోకి దిగబోతోంది.