26,300 రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు వెనక్కి - MicTv.in - Telugu News
mictv telugu

26,300 రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు వెనక్కి

December 20, 2021

దేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిన్న చిన్న బైకులను నడిపే వాహనదారులు ఒక్కసారైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకును నడపాలని ఆశపడుతాడు. దీనికి ప్రధానం కారణం రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ సౌండ్ మోత. ఈ సౌండ్‌లో అంత కిక్కు ఉంటుంది. అందుకే, యువత అంతగా ఇష్టపడుతారు. అయితే, సోమవారం రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఓ కీలక ప్రకటన చేసింది. 26 వేలకు పైగా బైకులను వెనక్కి తీసుకురావాలని పిలుపునిచ్చింది. ఇందుకు కారణం ఆ బైకులలో సాంకేతిక లోపాలు ఉన్నాయని, వాటిని నడిపితే, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున్న వాటిని వెనక్కి తీసుకురావాలని సూచించింది.

2021 సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 5వ తేదీ మధ్యన తయారైన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైకులలో వెనుక బ్రేకులో సమస్య ఉన్నట్లు కంపెనీ ఇంజనీరింగ్ యాజమాన్యం గుర్తించింది. బ్రేక్ పెడల్‌ను బలంగా నొక్కితే, రెస్పాన్స్ బ్రాకెట్‌పై ప్రతికూల ప్రభావం పడుతూ.. అది బ్రేక్ సామార్థ్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. ఈ మోడల్‌కు సంబంధించిన 26,300 బైకులను వెంటనే వెనక్కి పిలిపించాలని నిర్ణయించినట్లు యాజమాన్యం తెలిపింది.