Royal Enfield Company has announced offers on the Bullet bike
mictv telugu

గుడ్‌న్యూస్: 10వేలకే కొత్త బుల్లెట్..వివరాలు ఇదిగో

September 30, 2022

పండుగ సీజన్ వచ్చిన నేపథ్యంలో అనేక కంపెనీలు తమ ఉత్పత్తులను వినియోగదారులకు చౌకధరలకే అందిస్తున్నాయి. మరికొన్ని సులభ వాయిదాలలో చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఇప్పుడు ఈ విభాగంలోకి రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీ తన బుల్లెట్ బండిని తీసుకొచ్చింది.

బైకులలో రారాజుగా చెప్పబడే ఈ బైకుని పది వేలకే సొంతం చేసుకోవచ్చని ఆఫర చేసింది. మొదటగా రూ. 10,849 డౌన్ పేమెంట్ కట్టి బండి ఇంటికి తీసుకెళ్లవచ్చని, మిగతావి నెలవారీగా చెల్లించాలని సూచిస్తోంది. కంపెనీ వెబ్ సైటులో పెట్టిన సమాచారాం ప్రకారం.. బుల్లెట్ బండి 350 సీసీ ఆన్ రోడ్డు ధర రూ. 2.16 లక్షలుగా ఉంది. దీనిలోనే ఆర్టీవో, ఇన్సూరెన్స్ పాలసీ ఖర్చులు ఉంటాయి.

ముందుగా డౌన్ పేమెంట్ కట్టి తర్వాత నెలకు రూ. 7,357 ఈఎంఐ రూపంలో మూడేళ్లు చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీ 2,06,124 రూపాయలను రుణంగా అందిస్తుంది. లోన్‌పై వడ్డీ ఏడాదికి 9.5 శాతం ఉంది. అంటే మూడేళ్లకు మీరు చెల్లించిన మొత్తం రూ. 2,75,701 అవుతుంది. ఈ బైకు ఆరు వెర్షన్లలో, 15 రంగులలో లభ్యమవుతుంది. ఊదు గేర్లతో మైలేజ్ లీటరుకు 34.5 కిలోమీటర్లను కంపెనీ పేర్కొంది. ముందు, వెనుక డిస్క్ బ్రేక్స్, సింగిల్ ఛానెల్ ఏబీఎస్ ఉన్నాయి.