RE లవర్స్ కు గుడ్ న్యూస్..మరో అదిరిపోయే బైక్ - MicTv.in - Telugu News
mictv telugu

RE లవర్స్ కు గుడ్ న్యూస్..మరో అదిరిపోయే బైక్

November 3, 2022

 


బైక్ ప్రియుల ఎవర్ గ్రీన్ వెహికల్ రాయల్ ఎన్ ఫీల్డ్ మరో కొత్త మోడల్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. ఇటీవల కాలంలో క్రమం తప్పకుండా కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తున్న రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ మరో అదిరిపోయే బైక్‌తో ముందుకొచ్చింది. సరికొత్త హంగులు, రాయల్ లుక్స్ తో, అదరగొట్టే పవర్ తో RE సూపర్ మెటియోర్-650ని త్వరలో ఆవిష్కరించనుంది. ఇప్పటివరకైతే, బైక్ వెనుక భాగాన్ని మాత్రమే చూపిస్తున్నారు. త్వరలోనే దీనిని మార్కెట్‌లో కి విడుదల చేయనున్నారు. ఇది 2023 మొదట్లో భారత మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు.

టియర్ డ్రాప్ ఆకృతిలోని ఫ్యూయల్ ట్యాంక్, సర్క్యులర్ ఎల్ఈడీ హెడ్, టెయిల్ ల్యాంపులు, వెడల్పాటి హ్యాండిల్ బార్, స్ల్పిట్ సిటింగ్, డ్యూయల్ ఎగ్జాస్ట్, ట్రిప్పర్ నావిగేషన్‌తో కూడిన సెమీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ వంటి ఫీచర్లు దీనిలో పొందుపరిచారు. ఇది 648 సీసీ పార్లల్ ట్విన్ ఇంజిన్స్, 6 స్పీడ్ గేర్ బాక్స్, స్లిప్పర్ క్లచ్ తో వస్తోంది. డ్యూయల్ చానెల్ ఏబీఎస్ బ్రేకింగ్ ద్వారా భద్రతకు పెద్దపీట వేశారు. ఫ్రంట్ ఇన్వెర్టెడ్ ఫోర్క్స్-ట్విన్ షాక్ అబ్జార్బర్స్ తో మూడంకెల స్పీడ్ లోనూ ఎలాంటి తడబాటు లేకుండా దూసుకుపోతుంది. ఈ సూపర్ మెటియోర్-650 భారత మార్కెట్లో రూ.3.5 లక్షలు (ఎక్స్ షోరూం) ధర ఉండొచ్చని ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.RE లవర్స్ బైక్ కోసం ఎదురు చూస్తున్నారు.