ఈ మధ్య ఎక్కడ చూసిన రోడ్లపై బులెట్లే కనిపిస్తున్నాయి. నగర రోడ్లపైనే కాదు పల్లె దారుల్లోనూ మెరుస్తున్నాయి. లక్షరూపాయలు ఆపై బడ్జెట్ పెట్టేలొళ్లు వీటిని ప్రిపేర్ చేస్తున్నారు. బులెట్ కొనాలనే ఆలోచనలో ఉన్నావారికో గుడ్ న్యూస్.
జూలై ఫస్టు నుంచి జీఎస్ టీ అమల్లోకి వస్తుంది. దీంతో వాహనాల ధరలను కంపెనీలు తగ్గిస్తున్నాయి. తాజాగా టీవీఎస్ మోటార్స్, ఐషర్ మోటార్స్‌లో భాగమైన రాయల్ ఎన్ఫీల్డ్ ఇదే బాటలో నడుస్తున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ బులెట్, క్లాసిక్, థండర్బర్డ్ పేరిట మోటార్‌సైకిళ్లను అమ్ముతోంది. చెన్నై ఆన్‌రోడ్ ధరలో రూ.1,600 నుంచి 2,300 మేర తగ్గించినట్లు సంస్థ తెలిపింది. తగ్గించిన ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయంటోంది. అటు టీవీఎస్ వాహనాల ధరలు తగ్గాయి.