వాహన ప్రియులకు రాయల్ ఎన్ఫీల్డ్ మరో శుభవార్తను చెప్పింది. తమ కంపెనీ తాజాగా తయారు చేసిన కొత్త రాయల్ ఎన్పీల్డ్ ‘హంటర్ 350’ కొత్త లుక్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. విడుదల చేసిన ఈ హంటర్ 350 లుక్స్.. బైక్ ప్రియుల మనసును దోచేస్తుంది. ఈ బైక్‌ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకొస్తామని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఈ వాహనానికి సంబంధించి ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
” ఈ హంటర్ 350 జావా 42, హోండా సీబీ350 ఆర్ఎస్కు పోటీ ఇవ్వనుంది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 వాహనం మోటారు ఇంజన్ ఇందులో కూడా ఉంటుంది. అదే శక్తి, అదే టార్క్‌ను కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. గరిష్ఠంగా 114 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. ఒక లీటర్‌కు 36 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఈ వాహనం బరువు 181 కిలోలు, క్లాసిక్ 350 కంటే 10 కిలోలు తక్కువ” అని కంపెనీ తెలిపింది.
అంతేకాదు, ముందు భాగంలో 17 అంగుళాల చక్రంతో ఈ ఎన్ఫీల్డ్ బైక్‌ను తొలిసారిగా తీసుకొస్తున్నామని పేర్కొంది. ముందు, వెనుక ట్యూబ్ లెస్ టైర్లే ఉంటాయని, రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350 మెట్రో, రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 రెట్రో అని రెండు రకాలను తీసుకురానున్నామని తెలిపింది. ఇందులో రెట్రో ఎంట్రీ లెవల్ మోడల్, ఇందులో స్పోక్ వీల్స్‌ను కూడా ఆఫర్ చేస్తున్నామని వివరాలను వెల్లడించారు.