Royal Guard Near Queen Elizabeth II Coffin Faints, Falls On Face
mictv telugu

ఎలిజబెత్‌కు నివాళులర్పిస్తుండగా షాకింగ్ సంఘటన

September 15, 2022

క్వీన్ ఎలిజబెత్-2 ఇటీవలే తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కాగా.. రాణి అంత్యక్రియలు సెప్టెంబర్‌ 19న చారిత్రక వెస్ట్‌ మినిస్టర్‌ అబేలో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. వందల ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తూ.. రాణి అంతిమ సంస్కారాలను నిర్వహించనున్నారు. విండ్సర్‌ క్యాజిల్‌లోని సెయింట్‌ జార్జ్‌ చాపెల్‌లో భర్త చార్లెస్‌ సమాధి పక్కనే ఖననం చేయనున్నారు.

రాణి పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం సెప్టెంబర్‌ 14 నుంచి 4 రోజుల పాటు ప్రజల సందర్శనార్థం వెస్ట్‌మినిస్టర్‌ హాల్లో ఉంచారు. ఆమె శవపేటికను ఆ హాల్‌లోని కాటా ఫాల్క్ అని పిలిచే ఎత్తైన వేదికపై ఉంచారు. రాణి పార్థివదేహాన్ని సందర్శించి ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. ఈ తరుణంలో ఎవరూ ఊహించని ఘటన జరిగింది. శవపేటిక దగ్గర విధులు నిర్వహిస్తున్న రాయల్స్‌ బాడీగార్డ్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడున్న ఇతర గార్డ్స్‌ అతడి వద్దకు పరిగెత్తుకుని వచ్చారు. నీరసంగా ఉన్న కారణంగానే అతడు కుప్పకూలిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.