తరచూ సంభవిస్తున్న రైలు ప్రమాదాలు, అధికారుల హెచ్చరికలు ఇవేవీ కొందరి ప్రయాణికుల్లో మార్పు తేవడం లేదు. అదే నిర్లక్ష్యం, అవే తప్పులతో ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. కదులుతున్న ట్రైన్ నుంచి దిగవద్దు, ఎక్కవద్దు అంటూ అధికారులు మొర పెట్టుకుంటున్నా అవేం పట్టించుకోకుండా ప్రమాదాల బారిన పడుతున్నారు. కొందరు ప్రాణాల నుంచి తప్పుకుంటే..మరి కొందరు తృటిలో ప్రాణాల నుంచి బయటపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా కదులుతున్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించి..పడిపోయిన ఓ వ్యక్తిని ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రక్షించాడు. బీహార్‌లో జరిగిన ఈ ఘటన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
పూర్నియా స్టేషన్లో కదులుతున్న ట్రైన్‌ను ఎక్కేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించాడు. కాలు జారడంతో కింద పడిపోయి కాస్త దూరం ట్రైన్‌తో పాటు వెళ్ళిపోయాడు. ఇది గమనించిన ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వేగంగా పరుగెత్తుకు వచ్చి అతడిని కాపాడాడు. ప్లాట్‌ఫారమ్ మధ్య ఉన్న గ్యాప్‌లోకి జారిపడిపోతున్న సమయంలో చాకచక్యంగా వ్యవహరించి బయటకు లాగాడు. దీంతో ప్రాణాలతో బయట క్షేమంగా బయటపడ్డాడు. ఈ వీడియోను నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే షేర్ చేసింది. దీంతో నిండు ప్రాణాన్ని తన సమయ స్పూర్తితో కాపాడిన రైల్వే ఉద్యోగిపై సంజీవ్ కుమార్ సింగ్ కుమార్‌పై ప్రశంశల వర్షం కురుస్తోంది.
Alert RPF Constable Sanjiv Kumar Singh, on-duty at the Purnea station under Katihar division of NFR saved a passenger who tried to board a running train today at about 11-00 am @RailMinIndia @ani_digital pic.twitter.com/T10X24wrLw
— Northeast Frontier Railway (@RailNf) January 3, 2023
ఇవి కూడా చదవండి :
వరుడు ఇచ్చిన బహుమతికి వధువు షాక్!
ముగ్గురు భార్యలతో 5 క్రికెట్ టీంలు రెడీ చేసిన పాకిస్తానీ
కాళేశ్వరానికి డీపీఆరే లేదు.. ఎన్ని సార్లు డిజైన్ మార్చిర్రు..ఎవరికోసం మార్చిర్రు.. అన్ని తెలుసు మాకు