RPF police saved the mother and son
mictv telugu

క్షణాల్లో తల్లీకుమారుడిని కాపాడిన ఆర్పీఎఫ్ సిబ్బంది.. వీడియో వైరల్

August 9, 2022

ఇటీవలి కాలంలో రైలు ఎక్కబోతూ పడిపోయిన ఘటనలు చాలానే చూస్తున్నాం. అన్ని రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలు పెట్టడంతో దీనికి సంబంధించిన వీడియోలు బాగా వెలుగు చూస్తున్నాయి. రైలు ఎక్కబోతూ పడిపోతే అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది రక్షించిన ఘటనలు కోకోల్లలు. తాజాగా.. పశ్చిమ బెంగాల్‌లోని బంకురా స్టేషన్‌లో ఇలాంటి ఘటనే అక్కడి సీసీకెమెరాల్లో రికార్డయింది. తల్లీకొడుకులు రైలు ఎక్కడానికి రాగా, వారు వచ్చే సమయానికి రైలు కదులుతోంది. తన తల్లిని ఎలాగైనా ట్రైన్ ఎక్కించి తను కూడా ఎక్కాలని కొడుకు ప్రయత్నించగా, పెద్ద వయసు కావడంతో తల్లి ట్రైన్ ఎక్కలేక జారి పడిపోయింది. ఆమెను రైల్లో ఎక్కించాలని చూసిన కొడుకు కూడా స్లిప్ అయి పడిపోయాడు. ఒక్క క్షణం లేటయితే వారిద్దరూ రైలు చక్రాల కింద ఉండేవారే. కానీ, వెంటనే స్పందించిన ఆర్పీఎఫ్ సిబ్బంది పరుగున వెళ్లి క్షణాల్లో వారిద్దరి ప్రాణాలను కాపాడారు. రైల్వే శాఖ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ప్రయాణికులు కదులుతున్న రైలులో ఎక్కడం కానీ.. దిగడం కానీ చేయవద్దని కోరింది.