సన్ రైజర్స్ ఘనవిజయం.. ప్లేఆఫ్ ఆశలు సజీవం - MicTv.in - Telugu News
mictv telugu

సన్ రైజర్స్ ఘనవిజయం.. ప్లేఆఫ్ ఆశలు సజీవం

October 23, 2020

points

ఈ సీజన్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తన దూకుడు కొనసాగిస్తోంది. గురువారం రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు విజయం సాధించి తన ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అలాగే రాజస్థాన్ ప్లేఆఫ్ ఆశలను మాత్రం దాదాపు గల్లంతు చేసింది. నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. రాజస్థాన్ ఆటగాళ్లలో ఓపెనర్ ఉతప్ప 19, స్టోక్స్ 30, శాంసన్ 36 పరుగులు చేయగా, స్మిత్, 19, రియాన్ పరాగ్ 20, అర్చర్ 16 పరుగులు చేశారు. 

హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్ మూడు వికెట్లు పడగొట్టగా, విజయ్ శంకర్, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు. 155 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వార్నర్ సేన..  మరో 11 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని సొంతం చేసుకుంది. వార్నర్ (4), బెయిర్ స్టో (10) త్వరగానే పెవిలియన్ చేరినప్పటికీ మనీష్ పాండే, విజయశంకర్ అర్ధ సెంచరీతో జట్టుకి భారీ విజయాన్ని అందించారు. మనీష్ పాండే 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 83 పరుగులు చేయగా.. విజయ్ శంకర్ 6 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. విజయంలో కీలక పాత్ర పోషించిన మనీష్ పాండేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.