RRR 2 with Wonderful Point : Rajamouli
mictv telugu

వండర్‌ఫుల్ పాయింట్‌‌తో ఆర్ఆర్ఆర్ 2 : రాజమౌళి

November 19, 2022

పాపులర్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన మల్టీస్టారర్ సినిమా పాన్ ఇండియా రేంజులో సంచలన విజయం సాధించింది. ప్రపంవ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఓటీటీలో రికార్డులతో పాటు ఆస్కార్ బరిలో నిలిచి చరిత్ర సృష్టించింది. విదేశీ ప్రేక్షకులు ఈ సినిమాను విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఇటీవలే జపాన్‌‌లో విడుదలయిన ఈ సినిమా వసూళ్లలో బాహుబలి రికార్డును అధిగమించింది. తాజాగా అమెరికాలో ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహించగా, అనంతరం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమా సీక్వెల్‌‌పై కామెంట్ చేశాడు రాజమౌళి. ‘సినిమా హిట్టయిన తర్వాత రెండో భాగం ఉంటుందా అనే ఆసక్తి అందరిలో ఉంటుంది. నేను కూడా అలాగే ఆలోచిస్తాను. మంచి ఐడియా లేకపోతే నేను కూడా సీక్వెల్ చేయలేను. కేవలం డబ్బుల కోసమే సినిమా చేయాలంటే కుదరదు. ఆ విషయంలో నాకు చాలా స్పష్టత ఉంది. ఈ సినిమా చేస్తున్నప్పుడు సీక్వెల్‌కి కొన్ని పాయింట్స్ అనుకున్నాం. కానీ అవి అంత ఇంట్రెస్టింగ్‌‌గా లేకపోవడంతో పక్కన పడేశాం. కొన్ని వారాల క్రితం మా ఫ్యామిలీకి అద్భుతమైన లైన్ తట్టింది. నాకు చెప్పినప్పుడు నేను కూడా అలాగే ఫీలయ్యాను. ఆ పాయింట్‌తోనే ఆర్ఆర్ఆర్ 2 తీస్తాను. ముఖ్యంగా స్క్రిప్ట్ పూర్తిగా రెడీ కావాలి. ఆ తర్వాతే సినిమా ఎలా తీయాలనేది ఆలోచిస్తాన’ని అభిప్రాయం వ్యక్తం చేశారు.