'ఆర్ఆర్ఆర్' మరో కొత్త రికార్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆర్ఆర్ఆర్’ మరో కొత్త రికార్ట్

April 7, 2022

bfb

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇటీవలే తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం గతనెలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలై, ఎన్ని రికార్డులు సొంతం చేసుకుంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకవైపు రాంచరణ్, మరోవైపు జూ.ఎన్టీఆర్‌లు తమ నటనలతో అభిమానుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో ‘ఆర్ఆర్ఆర్’ భారీగా కలెక్షన్లు రాబడుతుంది. ఈ నేపథ్యంలో హిందీలో ఈ చిత్రం మరో కొత్త రికార్డ్‌ను సొంతం చేసుకుంది.

ఆర్ఆర్ఆర్ విడుదలై రెండు వారాలు పూర్తి కావొస్తుంది. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద హవా చూపిస్తుంది. తెలుగులోనే కాదు, బాలీవుడ్‌లో ఈ పీరియాడికల్ యాక్షన్ చిత్రం దూసుకుపోతోంది. తాజాగా మరో రికార్డు సృష్టించింది. కొవిడ్ తర్వాత విడుదలైన చిత్రాల్లో రూ. 200 కోట్లు కలెక్షన్లు రాబట్టిన రెండో హిందీ చిత్రంగా ‘ఆఆఆర్’ నిలిచింది. సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్స్ ఈ మేరకు ట్వీట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల నటన, రాజమౌళి టేకింగ్ యాక్షన్ సన్నివేశాలు సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. మరోవైపు బాలీవుడ్‌లోనూ ‘ఆర్ఆర్ఆర్’కు పోటీనిచ్చే స్థాయిలో సినిమాలు లేకపోవడంతో ఈ సినిమాకు కలిసొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.