దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటింది. భారీ బడ్జెట్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, అజయ్ దేవగణ్, అలియా భట్ వంటి స్టార్లతో రూపొందిన ఈ చిత్రం తెలుగు సహా పలు భారతీయ భాషల్లో సత్తా చాటింది. అంతటితో ఆగకుండా చైనా, జపాన్, యూఎస్ ప్రేక్షకులను కూడా మెప్పించింది. ఇంతలా విజయాన్ని దక్కించుకున్న సినిమా.. ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఆస్కార్’లో అవార్డు దక్కించుకోవాలని భారతీయ సినీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే 95వ ఆస్కార్ అవార్డుల నామినేషన్లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పోటీ పడనుంది.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ షార్ట్ లిస్ట్ అయింది. అయితే కీరవాణికి ఆస్కార్ అవార్డు వచ్చేందుకు అడుగు దూరంలోనే ఉందనిపిస్తోంది. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిలిం అవార్డ్స్ గెలుచుకుంది. ఇక అస్కార్ అవార్డుని కూడా సొంతం చేసుకుంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆర్ఆర్ఆర్ హిస్టరీ క్రియేట్ చేయనుంది. ‘ఆర్ఆర్ఆర్’తోపాటు మరో నాలుగు భారతీయ చిత్రాలు కూడా ఆస్కార్ అవార్డుల నామినేషన్స్‌లో పోటీ పడనున్నాయి. ఈ సినిమాల షార్ట్‌లిస్ట్‌ను తాజాగా అకాడమీ ప్రకటించింది. సుమారు 10 విభాగాలకు సంబంధించిన ఈ జాబితాలో నాలుగు విభాగాల్లో భారతీయ చిత్రాలు స్థానాలను దక్కించుకున్నాయి.
ఉత్తమ అంతర్జాతీయ సినిమా కేటగిరీలో ‘లాస్ట్ ఫిల్మ్ షో’ (Last Film Show), ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘ఆర్ఆర్ఆర్’ (RRR) నుంచి ‘నాటునాటు’, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో ‘ఆల్ దట్ బ్రీత్స్’, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విష్పరర్’ ఈ జాబితాలో చోటు సొంతం చేసుకున్నాయి. షార్ట్‌లిస్ట్‌లో ఎంపికైన చిత్రాలకు జనవరి 12 నుంచి 17 వరకూ ఓటింగ్ నిర్వహించనున్నారు. ఆ ఓటింగ్‌ను ఆధారంగా చేసుకుని జనవరి 24న ఆస్కార్ నామినేషన్లో నిలిచిన చిత్రాలను ప్రకటిస్తారు. అనంతరం మార్చి 12న విజేతలకు ఆస్కార్ అవార్డులు అందించనున్నారు.
మరో ముఖ్య విషయం ఏంటంటే… ప్రముఖ దర్శకుడు, కన్నడ నటుడు రిషబ్ శెట్టి చేసిన సినిమా ‘కాంతార’ మూవీని కూడా నామినేషన్స్‌లో చేర్చాలంటూ చిత్ర యూనిట్ తాజాగా ఆస్కార్ అకాడమీకి అప్లికేషన్‌ను పంపించింది. ఈ విషయాన్ని ‘కాంతార’ చిత్ర నిర్మాత విజయ్ కిరంగదుర్ అధికారికంగా ప్రకటించారు. హొంబళే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. కన్నడంలో ఈ మూవీ సక్సెస్ అవడంతో దీన్ని పాన్ ఇండియా రేంజ్లో చాలా భాషల్లో విడుదల చేశారు.