ఆర్ఆర్ఆర్ ప్రపంచ రికార్డు.. హాలీవుడ్ తలొంచేసింది - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్ఆర్ఆర్ ప్రపంచ రికార్డు.. హాలీవుడ్ తలొంచేసింది

March 28, 2022

 r

తొలిరోజు వసూళ్లలో దేశంలో కొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఇప్పుడు హాలీవుడ్ సినిమాను దాటేసింది. విడుదలైన మూడ్రోజుల్లో రూ. 500 కోట్లు కొల్లగొట్టి ప్రపంచ రికార్డును తన పేరున లిఖించుకుంది. హాలీవుడ్ ప్రఖ్యాత బ్యాట్‌మ్యాన్ చిత్రం రూ. 350 కోట్లే వసూలు చేసింది. ఇదికాక, తెలుగు రాష్ట్రాల్లో పలు రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. బాహుబలి 2 మూడ్రోజుల్లో రూ. 74.40 కోట్ల షేర్ సాధిస్తే, ఆర్ఆర్ఆర్ రూ. 139.27 కోట్లు రాబట్టంది. హిందీలో రూ. 74.50 కోట్లను సాధించింది. ఈ మేరకు బాలీవుడ్ విమర్శకుడు తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఇలా అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్‌కు దగ్గరగా వచ్చేసింది. ఇప్పటికే రూ. 500 కోట్లు రాగా, తొందర్లోనే వెయ్యి కోట్ల మార్కు దాటుతుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.