RRR Effect : footage of long queue for RRR tickets at los angeles video goes viral
mictv telugu

లాస్ ఏంజిల్స్ ను షేక్ చేస్తున్న RRR .. 342 రోజులైనా..

March 2, 2023

 

RRR Effect : footage of long queue for RRR tickets at los angeles video goes viral

RRR Effect : RRR చిత్రం విడుదలై 342వ రోజులు అవుతోంది. అయినా ఇప్పటికీ ఈ మూవీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. భారత్, జపాన్ థియేటర్ల ను శాశించిన మన బారతీయ చిత్రం ఇప్పుడు లాస్ ఏంజిల్స్ లోనూ దూసుకుపోతోంది. అమెరికాలో ఈ నెల మళ్లీ RRR చిత్రం తిరిగి విడుదలైంది. లాస్ ఏంజెల్స్ లో ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్ లో మూవీ స్క్రీనింగ్ జరుగుతోంది. సినిమా ప్రదర్శిస్తున్న లాస్ ఏంజెల్స్ థియేటర్ బయట టికెట్ల కోసం భారీ క్యూలైన్ లో ప్రేక్షకులు నిలబడి వేచిచూస్తున్న వీడియోను మేకర్స్ తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోతో పాటుగా ” RRR విడుదలైన 342వ రోజున USAలోని లాస్ ఏంజెల్స్‌లో 1647 సీట్లు అమ్ముడుపోయాయి. ప్రేక్షకులు సినిమా చూడటానికి ఇంత పెద్ద లైన్ కట్టడం ఎంతో అద్భుతంగా ఉంది ఆనందాన్ని అందిస్తోంది ” అని క్యాప్షన్ ను జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఆస్కార్ కు RRR నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ అవార్డుల వేడుకలో ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేసిన నాటు నాటు పాటను సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్ , కాల భైరవ లు వేదికపై లైవ్ గా పాడనున్నారు. నాటు నాటు పాట ఈ సంవత్సరం ఆస్కార్స్‌లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయ్యింది.

RRRలో జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగన్, ఒలివియా మోరిస్, సముద్రఖని, అలిసన్ డూడీ, కూడా నటించారు. RRR, 1920 నాటి కథ . ఇద్దరు లెజెండరీ స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు , కొమరం భీమ్ ల ఆధారంగా రూపొందించిన కల్పిత కథ. ఈ చిత్రం తొలిసారిగా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని, సత్తాను ప్రపంచవ్యాప్తంగా చూపించింది. అంతర్జాతీయ అవార్డుల సీజన్‌లను కూడా RRR శాసిస్తోంది. ఈ సంవత్సరం లాస్ ఏంజిల్స్‌లో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో RRR ఉత్తమ విదేశీ భాషా చిత్రం , ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో రెండు అవార్డులను గెలుచుకుంది. 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లోనూ నాటు నాటు ఉత్తమ పాట అవార్డును గెలుచుకుంది.