వసూళ్లలో ‘ఆర్ఆర్ఆర్’ తొలిరోజు రికార్డు బద్ధలు - MicTv.in - Telugu News
mictv telugu

వసూళ్లలో ‘ఆర్ఆర్ఆర్’ తొలిరోజు రికార్డు బద్ధలు

March 26, 2022

నిన్న విడుదలైన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం రికార్డుల వేట మొదలు పెట్టింది. దీని వల్ల ‘బాహుబలి 2’ మాత్రమే కాకుండా, అనంతరం వచ్చిన సినిమాల రికార్డులు కూడా బద్ధలయ్యాయి. తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఆల్‌టైం రికార్డు క్రియేట్ చేసింది. నైజాంలో రూ. 23.35 కోట్లు వసూలు చేసింది. మరోవైపు అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలలో రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది. ఆస్ట్రేలియాలో రూ. 4.03 కోట్లు రాబట్టి, ఈ నెల తొలివారంలో రిలీజైన ‘ది బ్యాట్‌మెన్’ రికార్డును అధిగమించింది. అమెరికాలో 5 మిలియన్ డాలర్లకు పైగా, న్యూజిలాండ్‌లో రూ. 37.07 లక్షలను వసూలు చేసింది. కాగా, ఈ కలెక్షన్లు చూస్తే, భారతదేశంలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. దర్శకుడు రాజమౌళిని ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ అభినందించారు. మీ ఊహాశక్తికి వందనాలు అంటూ విష్ చేశారు.