RRR First Week Japan Box Office Collections
mictv telugu

జపాన్ లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రభంజనం.. ఆల్ టైం హైయెస్ట్ రికార్డ్ కలెక్షన్స్.. ఎన్ని కొట్లో తెలుసా ?

October 30, 2022

రాజమౌళి ఎపిక్ ‘ఆర్ఆర్ఆర్’ జపాన్ లోను ప్రభంజనం సృష్టిస్తుంది. ఎన్టీఆర్ చరణ్ లు నటించిన ఈ మల్టి స్టారర్ ప్రపంచ వ్యాప్తంగా 1100కోట్లకి పైగా వసూల్ చేసింది. ఆ తరువాత ఉత్తర అమెరికా ఓటీటీలో 14.5 మిలియన్ డాలర్లు కొల్లగొట్టిన ఆర్ఆర్ఆర్ అమాంతం గ్లోబల్ ఇంట్రెస్ట్ పెంచేసింది. ముఖ్యంగా ట్రిపులార్ పై ఆన్ లైన్ లో వస్తున్న రెస్పాన్స్ చూసి.. వారం క్రితం జపాన్ లోను థియేట్రికల్ రిలీజ్ చేశారు. 9 లోకల్ సినిమాలతో పోటీ పడుతూ ఆర్ఆర్ఆర్ జపాన్ బాక్సాఫీస్ రిక్డార్డ్స్ ని షేక్ చేస్తుందని ట్రేడ్ లెక్కలు చెప్తున్నాయి. జపాన్‌లోని 44 నగరాలలో.. 209 మల్టిప్లెక్స్ స్క్రీన్‌లు, 31 IMAX స్క్రీన్‌లలో విడుదలైన ఈ హిస్టారికల్ డ్రామాకి తోలి షోకే పాజిటీవ్ టాక్ దక్కించుకుంది. విడుదలైన మొదటి వారమే JPY 73 million అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 4కోట్లు వసూల్ చేసింది ఆర్ఆర్ఆర్.

జపాన్‌లో విడుదలైన భారతీయ చిత్రాల్లో మొదటి వారం అత్యధిక కలెక్షన్స్‌లో ఆర్ఆర్ఆర్ అగ్రస్థానాన్ని సంపాదించినట్టు బాలీవుడ్ మీడియా చెప్తుంది. ఇక ఈ వారంలో RRR ‘ది బ్యాడ్ గైస్’, స్పెన్సర్, జురాసిక్ వరల్డ్ డొమినియన్ వంటి పాన్ వరల్డ్ చిత్రాల కంటే అత్యధిక వసూళ్లు సాధించిన విదేశీ చిత్రంగాను నిలిచినట్టు జపాన్ మీడియా ప్రచురించింది. ఇదిలా ఉంటే రజనీకాంత్ నటించిన ముత్తు 22కోట్లతో (JPY400 మిలియన్) జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇక SS రాజమౌళి బాహుబలి: ది కన్‌క్లూజన్, అమీర్ ఖాన్ 3 ఇడియట్స్, శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లీష్, అక్షయ్ కుమార్ ప్యాడ్‌మ్యాన్, దంగల్, బాహుబలి: ది బిగినింగ్ వంటి చిత్రాలు వరుసగా జపాన్ లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలుగా రికార్డు సృష్టించాయి. మరి వీటిలో ఎన్ని సినిమాల రికార్డ్స్ ని ఆర్ఆర్ఆర్ బ్రేక్ చేస్తుందో చూడాలి.