RRR ఫ్లాప్ అయితే పండగ చేసుకుంటారు.. వర్మ - MicTv.in - Telugu News
mictv telugu

RRR ఫ్లాప్ అయితే పండగ చేసుకుంటారు.. వర్మ

June 6, 2020

RRR

సినిమా పరిశ్రమ అంతా ఒక్కటే, ఒకే కుటుంబం అని మాట్లాడుతున్న సినీ పెద్దల మాటను వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తప్పుబట్టారు. ఇండస్ట్రీలో అందరూ కలిసి మెలిసి ఉన్నారని అనడం కన్నా పెద్ద బూతు వేరేది లేదని అన్నారు. ఇటీవల బాలకృష్ణ వివాదం చెలరేగిన తర్వాత కూడా సినీ ప్రముఖులంతా ఇదే డైలాగును వల్లిస్తున్నారు. అయితే ఇది సుద్ద తప్పు డైలాగ్.. టాలీవుడ్ ఎప్పుడూ ఒకటి కాదని చెబుతున్న వర్మ ఆడియో టేప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండస్ట్రీలో కుళ్లు, కుతంత్రాలు బాగా ఉన్నాయంటూ.. దర్శకుడు రాజమౌళి తీస్తున్న కొత్త సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తావనను తీసుకువచ్చారు. ఆ సినిమా గనక ఆడకపోతే ఇండస్ట్రీలో ఉన్న చాలామంది రోడ్ల మీదకు వచ్చి ఆనందంతో బట్టలూడదీసుకుని గెంతులు వేసి, పండగ చేసుకుంటారని వ్యాఖ్యానించారు.

ఇండస్ట్రీలో ఎవరి బిజినెస్ వారిదని… అంతా ఒకే కుటుంబం ఎంత మాత్రం కాదని వర్మ చెప్పారు. ఎదుటివాడి ఎదుగుదలను ఓర్వలేనితనం ఇండస్ట్రీలో చాలా ఎక్కువ స్థాయిలో ఉందని వర్మ తెలిపారు. ఒక వ్యక్తి సక్సెస్‌ను భరించలేని కుళ్లు అనేది మానవ నైజమని… ఇండస్ట్రీలో కూడా అదే ఉందని అన్నారు. అంతా ఒక్కటేఅనేది  బూతు అని.. అది ఎప్పటికీ జరగదని అన్నారు. ‘ఒక రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ నాయకుడి ఎదుగుదలను తట్టుకోలేడు. అలాగే ఓ వ్యాపారవేత్త ఇంకో వ్యాపారవేత్త ఎదుగుదలను తట్టుకోలేడు. కుళ్లు అనేది మానవ సహజం’ అని వర్మ మాట్లాడారు. కాగా, వర్మ ఆడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. వర్మ చెప్పింది వందశాతం నిజం అంటున్నారు. వర్మ నువ్వు నిజాలు చెప్పకు తట్టుకోలేరు అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.