తెలుగు చిత్రసీమ పరిశ్రమలో దర్శక ధీరుడుగా పేరుగాంచిన ఎస్ఎస్ రాజమౌళి ఇటీవలే తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఎంతపెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో హీరోలుగా జూ. ఎన్టీఆర్, రాంచరణ్ తమ నటనలతో ప్రేక్షకులను కట్టిపడేశారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం రూ. 1,100 కోట్లకు పైగా కలెక్షన్లతో దూసుకెళోంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రేక్షకులకు మరో శుభవార్తను చెప్పింది.
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్తోపాటు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. డిజిటల్ ప్రిమియంకు చిత్రబృందం రంగం సిద్ధం చేసింది. మే 20 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో ఈ సినిమా ”జీ5” ప్లాట్ఫామ్ వేదికగా అందుబాటులోకి రానున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనతో సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.