ఎన్టీఆర్ నటవిశ్వరూపం.. కొమురం భీముడో విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్టీఆర్ నటవిశ్వరూపం.. కొమురం భీముడో విడుదల

May 6, 2022

 

 

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ మెస్మరైజ్ చేయగా, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ అదరగొట్టాడు. ఈ సినిమా నుండి వరుసగా వీడియో సాంగ్స్‌ను రిలీజ్ చేస్తున్న చిత్ర యూనిట్, తాజాగా శుక్రవారం(ఈరోజు) సాయంత్రం ‘కొమురం భీముడో’ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది.

ఈ పాట‌లో ఎన్టీఆర్ నట విశ్వరూపానికి సినీ అభిమానులు ఫిదా అయ్యారు. ఎన్టీఆర్ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో పాటు ప్రముఖ రచయిత సుద్ధాల ఆశోక్ తేజ రాసిన లిరిక్స్.. ఈ పాటను సినిమాకే హైలెట్ చేశాయి. కాల‌భైర‌వ తన గాత్రంతో పాట‌కు ప్రాణం పోశాడు. ప్ర‌స్తుతం ఈ పాట సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.