‘ఆర్ఆర్ఆర్’ మోషన్ పోస్టర్..వచ్చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆర్ఆర్ఆర్’ మోషన్ పోస్టర్..వచ్చేసింది

March 25, 2020

rrr

‘బాహుబలి’ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్‌’. ఈ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు మొదటిసారి కలిసి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ అప్‌డేట్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమా టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ను ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. దీంతో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమా పేరును, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా పేరును ‘రౌద్రం రణం రుధిరం’ గా పెట్టారు. అయితే ఈ సినిమా పోస్టర్‌ను అభిమానులు ఎవ్వరూ ఫ్లెక్సీలుగా పెట్టకూడదని చిత్ర దర్శకుడు రాజమౌళి విజ్ఞప్తి చేశాడు. 

 

ఈ సినిమాలో ఎన్టీఆర్‌ తెలంగాణా సాయుధ పోరాట యోధుడు కొమరం భీంగా నటిస్తుండగా, రామ్‌చరణ్‌ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌కు జోడిగా బాలీవుడ్‌ నటి అలియా భట్‌ నటిస్తుండగా, ఎన్టీఆర్‌కు జోడిగా హాలీవుడ్‌ నటి ఒలివియా మోరీస్‌ నటిస్తోంది. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా సంక్రాతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది.