‘ఆర్ఆర్ఆర్’లో చిన్నారి ‘మల్లి’ ఎవరో తెలుసా? - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆర్ఆర్ఆర్’లో చిన్నారి ‘మల్లి’ ఎవరో తెలుసా?

March 29, 2022

 

bghj

ఆర్ఆర్ఆర్ సినిమాలో ఓ చిన్నారి చేసిన మల్లి పాత్ర గుర్తుందా. సినిమా ఆమెతోనే మొదలవుతుంది. గోండు గూడెంలో పెరుగుతున్న మల్లిని బ్రిటీష్ దొరసాని తనతో ఢిల్లీకి తీసుకెళ్లడంతో భీం పాత్ర పరిచయమవుతుంది. అయితే నిజ జీవితంలో ఈ అమ్మాయి ఎవరు? ఏ ఊరు? ఏం చేస్తుంటుంది? అనే ప్రశ్నలు ప్రేక్షకులకు కలగడం సహజం. దానికి సమాధానమే ఈ ఆర్టికల్. ఈమె పేరు ట్వింకిల్ శర్మ. ఊరు చండీఘర్. చాలా టీవీ ప్రకటనల్లో నటించింది. ఓ డాన్స్ షోతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ప్రకటనలో కనిపించింది. ఈమెను చూసిన రాజమౌళి మల్లి పాత్రకు ట్వింకిల్ శర్మను ఆడిషన్ నిర్వహించి సెలెక్ట్ చేశారు. కాగా, పేరున్న ఆర్టిస్టులు ఎందరున్నా ఈ చిన్నారి ధైర్యంగా తన పాత్రలో నటించిన తీరు ప్రతీ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటోంది.