rrr movie collection in japan
mictv telugu

జపాన్ లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రభంజనం.. అతితక్కువ సమయంలో ఆల్ టైం రికార్డ్స్

November 8, 2022

రాజమౌళి చారిత్రాత్మక చిత్రం RRR జపాన్‌లో ప్రభంజనం సృష్టిస్తుంది. RRR ఇప్పటికే పశ్చిమ దేశాలలో ముఖ్యంగా USA లో సంచలనం సృష్టించగా తాజాగా జపాన్ లోను సరికొత్త రికార్డులని నెలకొల్పుతుంది. నెట్‌ఫ్లిక్స్ లో దక్కిన అద్భుత రెస్పాన్స్ తో గ్లోబల్ లెవెల్లో ఆర్ఆర్ఆర్ కి భారీ క్రేజ్ ఏర్పడింది. అమెరికన్‌ల కోసం వేసిన అనేక స్పెషల్ షోలు ఆర్ఆర్ఆర్ కి మంచి హైప్ తీసుకొచ్చాయి. నెట్‌ఫ్లిక్స్‌లో హైయెస్ట్ వ్యూస్ కొల్లగొట్టిన ఈ చిత్రం నెం.1 నాన్ ఇంగ్లీష్ మూవీగా రికార్డులకు ఎక్కింది. ఇక యూఎస్, యూకే వంటి పశ్చిమ దేశాల్లో ఘన విజయం తరువాత.. జపాన్ వంటి తూర్పు దేశాల్లో సైతం దూసుకెళ్తుంది. ఇప్పటికే జపాన్ లో 10కోట్ల మార్కుని దాటేసింది ‘ఆర్ఆర్ఆర్’.

రాజమౌళి ఎప్పటి నుంచో జపాన్ మార్కెట్‌ను చేజిక్కించుకోవాలని చూస్తున్నాడు. గతంలో బాహుబలి2 వంటి టాలీవుడ్ సినిమాలకు జపాన్‌లో మంచి ఆదరణ లభించింది. అదే జోష్ తో RRRని కూడా విడుదల చేయగా జపాన్ బాక్సాఫీస్ ని షేక్ చేసేస్తుంది . తొలి నాలుగు రోజుల్లోనే రూ. 4 కోట్లను వసూలు చేసిన ఈ చిత్రం… 17 రోజుల్లో రూ. 10 కోట్లు వసూలు చేసి సత్తా చాటింది. జపాన్ లో తక్కువ సమయంలోనే ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అయితే జపాన్ లో అత్యధిక కలెక్షన్లను సాధించిన భారతీయ చిత్రాల్లో రజనీకాంత్ ‘ముత్తు’ తొలి స్థానంలో ఉండగా… ‘బాహుబలి’ రెండో స్థానంలో ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 1200కోట్లు కొల్లగొట్టిన ఆర్ఆర్ఆర్.. ఒక్క నైజాంలోనే 100కోట్ల షేర్ వసూల్ చేసిన తొలి చిత్రంగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది.