రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ చిత్రం భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చారు. ఓటీటీలో ఎవ్వరూ చేయనంత కొత్త పనికి శ్రీకారం చుడుతున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ సినిమా మొదట ఈ నెల 20వ తేదీన జీ5, నెట్‌ఫ్లిక్స్‌లలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా చూడాలంటే కొంత సొమ్ము ఆయా సంస్థలకు ప్రేక్షకులు చెల్లించాలి. జూన్ 3 నుంచి మాత్రం అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ సమాచారం నిజమైతే గనక ఓటీటీలో ఈ తరహా ప్రయోగం చేసిన మొదటి ఇండియన్ సినిమాగా ఆర్ఆర్ఆర్ చరిత్రలో నిలిచిపోనుంది. చూద్దాం, ఏం జరుగుతుందో.