షాకింగ్ రికార్డ్.. ఒక్కరోజు వసూళ్లు రూ. 223 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

షాకింగ్ రికార్డ్.. ఒక్కరోజు వసూళ్లు రూ. 223 కోట్లు

March 26, 2022

 

రికార్డుల వేట కొనసాగిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ నిన్న విడుదలైన ఒక్కరోజే రూ. 223 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. తద్వారా ఓపెనింగ్స్‌లో ‘బాహుబలి 2’ రికార్డును తిరగరాసింది. ఇందులో భారత్ వాటా రూ. 156 కోట్లు, అమెరికా రూ. 42 కోట్లు, ఇతర దేశాల్లో రూ. 25 కోట్లు వసూలు చేసింది. ఇక, ఏపీలో రూ. 75 కోట్లు, నైజాంలో రూ. 27.50 కోట్లు, ఉత్తర భారతంలో రూ. 25 కోట్లు, కర్ణాటకలో రూ. 14.50 కోట్లు, తమిళనాడులో రూ. 10 కోట్లు, కేరళలో రూ.4 కోట్లు వసూలు చేసింది. ఈ మేరకు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.