'ఆర్ఆర్ఆర్' చిత్రం సూపర్..అలియా భట్ - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆర్ఆర్ఆర్’ చిత్రం సూపర్..అలియా భట్

March 31, 2022

 

gbcb

బాలీవుడ్ అందాల తార, ఆర్ఆర్ఆర్ సినిమా హీరోయిన్ అలియా భట్ సోషల్ మీడియా వేదికగా ఓ ట్విట్ చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం హిందీలో రూ.100 కోట్ల వ‌సూళ్ల‌ను దాటిందని, ఆ విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. అంతేకాకుండా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సూపర్బ్ అని పేర్కొంది.

ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచ‌ర‌ణ్‌కు జోడీగా సీత పాత్రలో అలియా భట్ న‌టించిన‌ సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా విడులైన అనంత‌రం ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిపై ఆమె కోపంతో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి రాజమౌళిని అన్‌ఫాలో చేసినట్లు, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి సంబంధించిన కొన్ని పోస్టులను డిలీట్ చేసిన‌ట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఈ క్రమంలో తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం హిందీలో రూ.100 కోట్ల వ‌సూళ్ల‌ను దాటిన విష‌యాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేయ‌డంతో ఆ వార్తలకు చెక్ పడినట్లు అయింది. ఆమె నిజంగానే రాజ‌మౌళిపై ఆగ్ర‌హంతో ఉందా? లేక ఈ విష‌యంలో జ‌రిగిన ప్ర‌చారం ఒట్టి వదంతేనా? అన్న సందేహాలకు అలియా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తుంది.