RRR Movie Lovers And Netizens Slams Bandi Sanjay Tweet On RRR
mictv telugu

RRR టీమ్‌కు బండి సంజయ్ ప్రశంసలు.. తిట్టిపోస్తున్న నెటిజన్లు

March 14, 2023

RRR Movie Lovers And Netizens Slams Bandi Sanjay Tweet On RRR Bags Oscar Award

ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ వచ్చిన వేళ.. దేశమంతా సంబురపడుతోంది. ఈ సినిమా బృందానికి, మరీ ముఖ్యంగా దర్శకుడు రాజమౌళికి రాజకీయ, సినీ ప్రముఖులే కాకుండా అన్నిరంగాల వారు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సినిమా రిలీజ్‌కు ముందు చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. సినిమాకు ముందు బీజేపీ శ్రేణులు ఈ వీడియోను పెద్ద ఎత్తున వైరల్ చేశారు. రాజమౌళికి వార్నింగులు ఇస్తూ పోస్టులు పెట్టారు. ఇప్పుడు.. వాళ్లంతా అదే సినిమా టీం సాధించిన ఘనతకు సాహో అంటూ శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. ఇదే క్రమంలో.. అప్పడు వాళ్లు అన్న మాటలను సీరియస్‌‌గా తీసుకున్న కొందరు మాత్రం.. ఇప్పుడు ఆ వీడియోతో ట్రోల్స్ చేస్తున్నారు.

గతంలో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ డైరెక్టర్‌ రాజమౌళిని ఉద్దేశించి… బిడ్డ నువ్వు కనక సినిమా రిలీజ్‌ చేస్తే బరిసెలతో కొట్టి కొట్టి చంపుతాం, ఉరికిచ్చి కొడతాం. ప్రతీ సినిమా థియేటర్‌ను కాలపెడతం.. అని బండి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మళ్లీ షేర్ చేస్తున్న నెటిజన్లు.. ఇలాంటి చిల్లర పాలిటిక్స్ మానుకోవాలని హెచ్చరించారు.

ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి వ్యక్తి బండి సంజయ్ అంటూ నెటిజన్స్ విమర్శిస్తున్నారు. బండి సంజయ్ చేసిన ట్వీట్ ను కొందరు రీట్వీట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి బెదిరింపు రాజకాయాలు మానుకోవాలని హెచ్చరించారు. ఆస్కార్ వచ్చింది కాబట్టి డాల్బీ థియేటర్ కూడా తగులబెడతావా అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి బండి సంజయ్ వైఖరిని నిరసిస్తూ నెటిజన్స్ రియాక్ట్ అవుతుండటంతో ట్రెండింగ్ గా మారింది. నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కడం పట్ల భారతదేశం హర్షం వ్యక్తం చేస్తోంది.