మరో ఘనమైన రికార్డు సాధించిన ఆర్ఆర్ఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

మరో ఘనమైన రికార్డు సాధించిన ఆర్ఆర్ఆర్

June 1, 2022

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేర లిఖించుకున్నది. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం ఓటీటీలో రిలీజవగా.. అక్కడ కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో మే 23 నుంచి 27వ తేదీ వరకు ఈ చిత్రం 1,83,60,000 గంటల వ్యూస్‌తో నెంబర్ వన్‌గా నిలిచింది. తద్వారా నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన నాన్ ఇంగ్లీష్ చిత్రంగా ఖ్యాతికెక్కింది. కాగా, రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ఇప్పటికే పలువురు హాలీవుడ్ నటులు, దర్శకుల ప్రశంసలు పొందింది.