RRR Movie Not Included In Bookmyshow 2022 Best Movies Categories
mictv telugu

ఆర్ఆర్ఆర్ కి షాక్.. బుక్ మై షో బెస్ట్ ఇండియన్ మూవీస్

December 20, 2022

Book My Show 2022 Best Indian Movies

టాప్ ఆన్ లైన్ టికెటింగ్ వెబ్‌సైట్ బుక్ మై షో 2022 సంవత్సరానికి గాను టాప్ 10 బెస్ట్ ఇండియన్ మూవీస్ జాబితాను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. సుమారు 8 మిలియన్ల భారతీయ ప్రేక్షకులు ఆల్ లైన్ ద్వారా పలు భాషల్లో సినిమాలని తిలకించినట్టు పేర్కొంది. వీరిలో 6,00,000 మంది సోలో టికెట్ ద్వారా వెళ్లారని చెప్పింది. ఇండియాలో సినిమా అనేది జీవితంలో ఒక భాగమైపోయింది ముఖ్యంగా దక్షిణ భారతీయులు కళాకారులని దేవుళ్లుగా ఆరాధిస్తారు. నచ్చిన సినిమాని గుండెలకు హత్తుకుంటారు. ఈ నేపథ్యంలో 2022 టాప్ – 10మూవీస్ లిస్టులో బాలీవుడ్ పై సౌత్ సినిమాలు స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపించాయి. అలా ఈ ఏడాది దాదాపు 77 సినిమాల్ని ప్రేక్షకులు బాగా ఆదరించాగా.. ఆ లిస్టుని ప్రముఖ టికెటింగ్ ఫ్లాట్ ఫామ్ బుక్ మై షో రిలీజ్ చేసింది. ‘బుక్ మై షో’ రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం..ఈ ఏడాది అద్దిరిపోయే రేంజ్ లో ఎంటర్ టైన్ చేసిన సినిమా ‘కేజీఎఫ్ 2’. ఈ మూవీ రిలీజ్ రోజు.. బుక్ మై షోలో ఏకంగా 21 లక్షలకు పైగా టికెట్స్ సేల్ అయ్యాయి. ఎలాంటి అంచనాలే లేకుండా విడుదలై ఘన విజయం సాదించిన కేజిఎఫ్ కి సీక్వెల్ గా వచ్చిన కేజిఎఫ్2కి భారతీయులు బ్రహ్మరథం పట్టారు.

దేశంలో అన్ని వర్గాల ఆడియన్స్ కేజిఎఫ్2 ని వీక్షించారని.. దాంతో ఈ ఏడాది ఎక్కువ సేల్ అయిన టికెట్స్ లెక్కల ప్రకారం.. టాప్ లో ‘కేజీఎఫ్ 2’ నిలిచింది. ఆ తరువాతి స్థానం తెలుగోడి సెన్షేషన్ ఆర్ఆర్ఆర్ కి దక్కింది. ఆస్కార్ కొట్టడమే టార్గెట్ గా విదేశాల్లో భారీ ప్రయత్నాలు చేస్తున్న జక్కన్న అండ్ టీమ్ కి ఇది షాక్ అని చెప్పొచ్చు. ఆ తరువాతి స్థానాల్లో వరుసగా.. కాంతార, కశ్మీర్ ఫైల్స్, పొన్నియన్ సెలన్వ్ 1, బ్రహ్మాస్త్ర, విక్రమ్, దృశ్యం 2(హిందీ), భూల్ భులయ్యా 2, డాక్టర్ స్ట్రేంజ్: మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్ చిత్రాలు ఉన్నాయి. ఈ ఏడాది జాబితాలో ఉన్న ఒకే ఒక్క తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇక ఈ నివేదికలో పలు టాప్ ఈవెంట్స్ లిస్టుని కూడా పేర్కొంది బుక్ మై షో. డ్యాన్స్, మ్యూజిక్ విభాగంలో అలాన్ వాకర్, DJ స్నేక్ అగ్రస్థానంలో నిలిచారు. స్టాండ్-అప్ కమెడియన్లు హర్ష్ గుజారాల్, అనుభవ్ సింగ్ బస్సీ, వీర్ దాస్, సంగీతకారుడు దిల్జిత్ దోసాంజ్, నటుడు రోహిత్ రాయ్ ఇతర అగ్ర కళాకారుల ఈవెంట్స్ కి భారీగా ఆడియన్స్ టికెట్స్ కొన్నట్టు నివేదిక అందించింది బుక్ మై షో.

ఇవి కూడా చదవండి :

నాగార్జున కి బిగ్ షాక్.. హోస్టుగా బాలకృష్ణ ?

భర్త కూతురి ముందే కిస్.. ఐశ్వర్య రణవీర్ ల పబ్లిక్ రొమాన్స్ వీడియో లీక్

తను లేకపోతే బన్నీ లేడు..!