RRR Movie Oscar Nominations Behind The Story
mictv telugu

ఆర్ఆర్ఆర్‌కి ఆస్కార్ నామినేషన్ వెనుక… డబ్బుల రాజకీయాలా ?

January 25, 2023

RRR Movie Oscar Nominations Behind The Story

రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయ ప్రశంసలతో పాటు అత్యున్నత అవార్డులని కూడా కొల్లగొడుతోంది. ఇప్పటికే ఎంతోమంది హాలీవుడ్ ప్రముఖుల కాంప్లిమెంట్స్ అందుకున్న ఈ చిత్రానికి గ్లోబల్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చింది. అయితే ఇదే ఊపులో ప్రతిష్టాత్మక ఆస్కార్‌కి నామినేట్ అయి.. అవార్డుకి అడుగు దూరంలో నిలిచింది ఆర్ఆర్ఆర్. భారత ప్రభుత్వం సహకరించకున్నా.. సొంత ఖర్చులతో రాజమౌళి ట్రిపులార్ చిత్రాన్ని పలు అంతర్జాతీయ వేడుకల్లో భారీగా ప్రమోట్ చేశాడు. ఓటింగ్ విధానం ద్వారా ఆస్కార్‌కు చేరుకోవడానికి రాజమౌళి కొత్త వ్యూహంతో ముందుకెళ్లి సక్సెస్ దిశగా అడుగులేస్తున్నారు. RRRని ప్రమోట్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో రాజమౌళి పర్యటించాడు. ఎన్నో అవార్డు ఈవెంట్లలో తన ఉనికిని చాటుకుంటున్నాడు. ఓటు వేయడానికి అర్హత ఉన్న నిపుణుల బృందంతో సహా వివిధ వ్యక్తులని, అంతర్జాతీయ క్రిటిక్స్ కోసం RRR ప్రత్యేక ప్రదర్శనలు వేశాడు. అయితే బయట చెప్తున్నట్టు ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం 50 కోట్లు ఖర్చు చేసిన మాట నిజమైనా.. ఆ ఖర్చు మరొక రూట్లో అయ్యిందట.

హాలీవుడ్‌లో హైలెట్ కావడానికి ప్రధానంగా వెరైటీ అనే ఒక ఆంగ్ల మీడియా చాలా ఉపయోగపడిందని టాక్. జపాన్‌లో రజినీకాంత్ ముత్తు రికార్డ్స్‌ని చెరిపేసి ఆల్ టైం హైయెస్ట్ ఇండియన్ గ్రాసర్‌గా నిలవటం మరింత ప్లస్ అయ్యిందంట. అందుకే ఎన్టీఆర్, చరణ్ కుటుంబంతో సహా అక్కడి భాష నేర్చుకుని ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇక ప్రమోషన్స్ కోసం 50కోట్లు అని బయట టాక్ ఉన్నా అందులో నిజం లేదంటున్నారు. ఆస్కార్ అవార్డు రావడం కోసమే కోట్లు ఖర్చు చేయలేదు కానీ.. సినిమాను ప్రమోట్ చేసి కలెక్షన్స్ రావట్టడానికి మాత్రం.. అందరూ మాట్లాడుకునేలా కంటెంట్ తోనే ప్రమోట్ చేశారు. అందుకే 50కోట్లు అయినట్టు తెలుస్తోంది. అంతేకాని రాజకీయాలతో డబ్బులు వెదజల్లి ఆస్కార్‌కి నామినేట్ కాలేదని RRR టీమ్ చెప్తున్న మాట. ఎక్కువగా ఈ సినిమాను ఇంగ్లీష్ మీడియాలో హైలెట్ చేయడం కోసం వివిధ రకాల ఆర్టికల్స్ అలాగే ఇంటర్వ్యూల కోసం కొంత ఖర్చు చేశారట. ఆ విధంగానే కంటెంట్ ను హైలైట్ చేసి ఇప్పుడు అవార్డులు అందుకునే వరకు వెళ్లారు. మరి ఆస్కార్ అవార్డును ఈ సినిమా అందుకుంటుందో లేదో చూడాలి.