రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా వచ్చిన మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. రికార్డు స్థాయిలో రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం మళ్లీ థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. అయితే మన దగ్గర కాదు అమెరికాలో. అక్కడ జూన్ 1న వంద థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. అదీ ఒక్కరోజే థియేటర్లలో ఉంచుతారంట.
దీనికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమవగా, టిక్కెట్లన్నీ అప్పుడే అమ్ముడుపోయాయని టాక్. అయితే మళ్లీ ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే.. సినిమాలో డిలేటెడ్ సీన్స్, అన్ కట్ వెర్షన్తో కలిపి రిలీజ్ చేస్తున్నామని ట్విట్టర్లో ప్రకటించారు. మరి ఈ అన్ కట్ వెర్షన్ సినిమా ఇండియా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో మాత్రం చిత్ర బృందం తెలియపరచలేదు.