RRR విడుదల తేదీ వచ్చేసింది..  - MicTv.in - Telugu News
mictv telugu

RRR విడుదల తేదీ వచ్చేసింది.. 

January 25, 2021

RRR movie release date

తెలుగు సినిమా ప్రేక్ష‌కులతోపాటు తెలుగు భాష తెలియని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘బాహుబలి’ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్ 13న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు టీమ్ తెలిపింది. దసరా నాటికి ఈ మల్టీస్టార్ మూవీ వెండితెరపైకి రానుంది. అడ్డుకోలేని నిప్పు, నీటికి సాక్షులుకండి అంటూ ఆసక్తి రేపెట్టింది. గుర్రంపై రామ్ చరణ్, బైక్‌పై జూనియ్ ఎన్టీఆర్‌లు దూసుకెళ్తున్న పోస్టర్‌ను ట్వీట్ చేసింది.  

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షెడ్యూలు ప్రకారం సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండింది. అయితే కరోనా వల్ల జాప్యం జరిగింది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కుమరం భీంగా నటిస్తున్న ఈ చారిత్రక కల్పన కథాచిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయ. కొద్ది రోజుల్లోనే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్‌కు వెళ్తున్న ఈ చిత్రంలో ఒలీవియా మోరిస్, అలియా భ‌ట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.