అమెరికాలో భారీ వసూళ్లు.. తొలి తెలుగు సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో భారీ వసూళ్లు.. తొలి తెలుగు సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు

March 25, 2022

ggg

మన దేశంలో ఇవ్వాళ విడుదలైన భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ అన్ని చోట్ల నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. మన కంటే ఒకరోజు ముందు రిలీజైన అమెరికాలో కూడా ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. అభిమానుల తాకిడికి బాక్సాఫీసు వద్ద కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. అక్కడ 981 చోట్ల ఈ సినిమా రిలీజవ్వగా కేవలం నిన్న సాయంత్రం వరకు మూడు మిలియన్ డాలర్లు (రూ. 22.85 కోట్లు) వసూలు చేసింది. దీంతో ప్రీమియర్ షోల ద్వారా మూడు మిలియన్ డాలర్లు రాబట్టిన తొలి తెలుగు చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఇక, ప్రీమియర్స్‌కు సంబంధించిన మొత్తం లెక్కలు తెలిస్తే.. అంకెలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని సరిగమ సినిమాస్ ట్విట్టర్‌లో వెల్లడించింది. కాగా, ఇండియాలో ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్లలో భారీ రికార్డు నెలకొల్పబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.