రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మనదేశంలో ఈ చిత్ర విజయం ఊహించిందే కానీ, యూరప్, జపాన్ వంటి దేశాల్లో కూడా ఈ చిత్రం దుమ్ము రేపుతుండడంతో భారతీయ సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇంగ్లీషు భాషలో ఓటీటీలో రిలీజైనప్పుడు ఈ చిత్రం చేసిన హంగామా అంతా ఇంతా కాదు. జక్కన్న టేకింగ్ కి హాలీవుడ్ సైతం ఫిదా అయిపోయింది.
అంతటితో ఆగక పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఈ చిత్రం ప్రదర్శితమైంది. ఈ నేపథ్యంలో అవార్డులు సైతం ఈ చిత్రానికి దాసోహం అవుతున్నాయి. ఇటీవలే రాజమౌళికి న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ బెస్ట్ డైరెక్టరుగా అవార్డిచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ స్పాట్ లైట్ విన్నర్ అవార్డుకు ఎంపికైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న లాస్ ఏంజిల్స్ లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ అవార్డుకు ఎంపికవడం పట్ల ఆర్ఆర్ఆర్ టీం హెచ్ సీఏ జ్యూరీకి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసింది. ఇక ఈ వరుస అవార్డులు ప్రకటించిన న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ కి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇక్కడ అవార్డు అందుకుంటే ఆస్కార్ అవార్డు దాదాపు ఖరారైనట్టే భావిస్తారు. 1935 నుంచి చూసుకుంటే ఈ అవార్డు అందుకున్న వారితో 43 శాతం మంది ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. మరి రాజమౌళి, ఆర్ఆర్ఆర్ లకు ఆ యోగం ఉందో లేదో చూడాల్సి ఉంది.
We RRR elated… 🤩
The cast and crew of #RRRMovie bags the prestigious HCA Spotlight Winner Award!
We'd like to thank the @HCAcritics jury for recognising #RRRMovie ! pic.twitter.com/j5S8B2Rgvq
— RRR Movie (@RRRMovie) December 6, 2022