వారం రోజుల్లో విడుదల కాబోతున్న పాన్ ఇండియా ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిన చిత్రం కావడం, పైగా మల్టీస్టారర్ చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయినా అంచనాలను అందుకోవడంతో రాజమౌళి ఎప్పుడూ విఫలం కాలేదు. ఈ నమ్మకంతోనే అత్యంత భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీశారు. అంతే స్థాయిలో వసూళ్లు రాబట్టడానికి రాజమౌళి ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. వారం రోజుల్లోనే దేశం మొత్తం చుట్టేసే విధంగా షెడ్యూల్ విడుదల చేశారు. మార్చి 18 న హైద్రాబాద్, దుబాయ్‌లలో ప్రి రిలీజ్ ఈవెంట్, 19 న కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో ప్రి రిలీజ్ ఈవెంట్, 20 న బరోడా, ఢిల్లీ 21న అమృత్సర్, జైపూర్, 22న కోల్‌కతా, వారణాసి, 23న వారణాసి, హైద్రాబాద్‌లలో ప్రమోషన్ కార్యక్రమాలను జక్కన్న టీం డిజైన్ చేసింది. కాగా, నటీనటులు, దర్శకుడి పారితోషికం కాకుండా సినిమాను నిర్మించడానికి రూ. 335 కోట్లు ఖర్చయిందని ఏపీ ప్రభుత్వానికి రాజమౌళి పెట్టిన దరఖాస్తులో ఉందని మంత్రి పేర్ని నాని వెల్లడించడం గమనార్హం.