ఢిల్లీ నుండి గల్లీ వరకు మీడియాలో నేడు ఆర్ఆర్ఆర్ పైనే చర్చ. నాటునాటుకి గోల్డెన్ గ్లొబ్ ఒరిజినల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చిందన్న వార్తతో ఇండియా మొత్తం హోరెత్తిపోతుంది. దేశంలోని హీరోలు, దర్శకులు, సంగీత దర్శకులు అంతా ఆర్ఆర్ఆర్ టీమ్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశారంటూ ప్రధాని మోడీ ప్రశంసించగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబులు కూడా ఆర్ఆర్ఆర్ టీమ్ కి కంగ్రాట్స్ చెప్పారు. ఇటీవలి కాలంలో ఎన్టీర్.. చంద్రబాబు పుట్టిన రోజులకు కూడా పెద్దగా శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేసిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు మాత్రం ధ్యాంక్యూ మామయ్యా అని ప్రత్యేకంగా బంధుత్వం కలుపుతూ చెప్పడం సహజంగానే చర్చనీయాంశం అవుతోంది.
నాటునాటు పాటకి అవార్డు వచ్చిందన్న వార్త వినగానే స్టన్ అయ్యానని.. ఇప్పుడు ఇండియన్ సాఫ్ట్ పవర్ గా ప్రపంచం దృష్టిని తెలుగు ఆకట్టుకుంటుండటం గర్వకారణమని చంద్రబాబు ట్వీట్ చేయగా.. ‘థాంక్యూ సో మచ్ మామయ్య’ అని ఎన్టీఆర్ రిప్లై ఇచ్చాడు. ఇక మరోవైపు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. బుధవారం ఉదయం ట్వీట్ చేసిన జగన్.. ‘తెలుగు జెండా పైకి ఎగిరి రెపరెపలాడుతోంది. యావత్ రాష్ట్రం తరపున.. కీరవాణి, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్.. మొత్తం ఆర్ఆర్ఆర్ టీంకు అభినందలు తెలియజేస్తున్నా. మిమ్మల్ని చూసి మేం చాలా గర్వపడుతున్నాము’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. దానికి జూనియర్ ఎన్టీఆర్ రప్లై ఇచ్చారు. థాంక్యూ సార్.. అంటూ ట్వీట్ చేశారు. ఇక ఎప్పుడు పెద్దగా పొలిటీషియన్స్ ట్వీట్స్ కి స్పందించని ఎన్టీఆర్.. తాజాగా ఆర్ఆర్ఆర్ అవార్డు పుణ్యమాని వరుసగా రీ ట్వీట్స్ చేయటం చర్చనీయాంశం అవుతుంది.