ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుని ‘నాటు నాటు’ సాంగ్ గెలుచుకోవడంతో సినీ ప్రియులంతా సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోసారి జనమంతా యూట్యూబ్‌లో నాటు నాటు సాంగ్ ను వీక్షిస్తున్నారు. ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటకి వెస్ట్రన్ డ్యాన్సర్స్ డాన్స్ పెర్ఫామన్స్ కూడా ..ఆకట్టుకుంటుంది. ట్విట్టర్ లో ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక ఈ వేడుక కోసం రామ్‌చరణ్, ఎన్టీఆర్, ఎం.ఎం.కీరవాణీ, ఎస్ఎస్ రాజమౌళి, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ అంటెండ్ అయిన సంగతి తెలిసిందే. భారతీయతను చాటేలా మూవీ టీమ్ అంతా ట్రెడిషనల్ డ్రెస్ లో ఆస్కార్ వేడుకకు హాజరయ్యారు. పంచె, పైజామాలతో రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ స్టేజ్ పై పెర్ఫామన్స్ ఇవ్వగా.. బ్లాక్ సూట్‌లో చంద్రబోస్, గ్రీన్ ట్రెడిషనల్ డ్రెస్ లో కీరవాణి అవార్డును అందుకున్నారు. ఇక రాజమౌళి, కార్తీకేయ పంచెకట్టులో, రామ్ చరణ్ స్టైలిష్ లుక్‌తో అదరగొట్టారు. జూ.ఎన్టీఆర్ కూడా ఓ స్పెషల్ డ్రెస్ లో అందర్నీ ఆకట్టుకున్నాడు.
India walks the red carpet at The Oscars with NTR @tarak9999 #Oscars #Oscars95 #RRRMovie pic.twitter.com/jVgTsPCznk
— …. (@ynakg2) March 13, 2023
రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై నడిచి అలరించారు. ఈ తరుణంలో ఓ విశేషం చోటు చేసుకుంది. ఈ వేడుక కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన సూట్‌ని ఎన్టీఆర్ ధరించాడు. దానిపై పులిబొమ్మ ఉంది. కరెక్ట్‌గా ఎన్టీఆర్ భుజంపైకి వచ్చి.. అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఆ పులి బొమ్మ గురించి ఆస్కార్ నిర్వాహకులు ఆరా తీశారు. వారు ఆ బొమ్మ ఎందుకు వేసుకొచ్చావని ఓ యాంకర్ అడగగా.. ‘ఆర్‌ఆర్‌ఆర్ లో తనతో కలసి దూకిన పులి ఇదే’.. అంటూ సరదాగా మట్లాడాడు. అయితే ఈ పులిని ఎవరు తయారు చేశారని యాంకర్ అడగ్గా… తన ఫ్రెండ్, డిజైనర్ గౌరవ్ గుప్తా ఈ డ్రెస్ ను డిజైన్ చేసినట్లు తెలిపాడు. భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా తాను ఈ డ్రెస్ లో వచ్చినట్టు చెప్పాడు ఎన్టీఆర్. ‘నిజానికి, పులి.. భారత జాతీయ జంతువు. మా దేశ సింబల్‌తో రెడ్ కార్పెట్‌పై నడవడం గర్వంగా ఉంది’ అని చెప్పి ఎన్టీఆర్ అందరినీ ఆకట్టుకున్నాడు. అది విన్న యాంకర్ మిమ్మల్ని చూసి సౌత్ ఏసియా మొత్తం గర్వపడుతుందని తెలిపారు.