RRR Oscar Award Controversy : Jimmy Kimmel Called RRR Bollywood Film During Oscar Fans are furious
mictv telugu

RRR Oscar Award Controversy : బుద్ధిపోనిచ్చుకోరు – అది తెలుగు సినిమా రా నాయనా

March 13, 2023

RRR Oscar Award : Jimmy Kimmel Called RRR Bollywood Film During Oscar Fans are furious

బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. భారతీయ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అని బలంగా నాటుకు పోయింది విదేశీయులలో. గత రెండు, మూడు నెలలుగా ఆర్ఆర్ఆర్ మూవీ విదేశీ అవార్డులను దక్కించుకుంటూ ప్రభంజనం సృష్టిస్తున్నా ఇంకా పడుకునే ఉన్నారు హాలీవుడ్ వాళ్ళు. మొత్తం భారతదేశమే తెలుగు సినిమా జయహో అని అంటుంటే ఆర్కార్ హోస్ట్ మాత్రం బాలీవుడ్ మూవీ అంటూ వేదిక మీద అనడం అందరికీ కోపం తెప్పిస్తోంది.

అస్కార్ లాంటి వేదిక మీద తప్పు దొర్లడం అంటే మామూలు విషయం కాదు. ప్రతీ విషయాన్ని పట్టి పట్టి చూస్తారు. అందులోనూ భారతీయులు ఇప్పడు చాలా ఎమోషనల్ గా ఉన్నారు. ఏచిన్న తప్పు జరిగినా ఒప్పుకునే మూడ్ లో అస్సలు లేరు. అలాంటి టైమ్ లో జక్కన్న చెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీని బాలీవుడ్ మూవీ అంటే ఎవరైనా ఊరుకుంటారా…మరి అదే పెద్ద తప్పు చేశాడు హోస్ట్ జిమ్మి కిమ్మెల్. వేదిక మీదకు వచ్చినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు అలా తెలుసుకోకుండా ఎలా మాట్లాడతారో ఏంటో. లేదా తాము ఏం చేసినా చెల్లుతుంది అనే పొగరో అంటూ మండిపడుతున్నారు భారతీయులు, నెటిజన్లు.

ఇండియా అంటే బాలీవుడ్ ఒక్కటే కాదు చాలా భాషలు ఉన్నాయంటూ గోల పెడుతున్నారు. అస్కార్ లాంటి పెద్ద అవార్డ్ షంక్షన్ లో ఆ మాత్రం జాగ్రత్తగా ఉండపోతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.