Oscar : ఈ సంవత్సరం జరిగే 95వ ఆస్కార్ వేడుకలు భారతీయులకు వెరీ స్పెషల్..ఎందుకంటే ఆస్కార్ బరిలో తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ నిలవడమే అందుకు కారణం. నాటు నాటు పాటకు ఎలాగైన ఆస్కార్ వస్తుందన్న నమ్మకంతో ఉంది రాజమౌళీ టీం. అదే గనుక జరిగితే భారతీయ సినిమాకు ఇది చారిత్రాత్మక విజయం అవుతుంది. వరల్డ్ వైడ్‌గా ఉన్న సినిమా ప్రేమికులందరి చూపు ఇప్పుడు ఆస్కార్‌పైనే ఉంది. మన తెలుగు కుర్రాళ్ళు ఆస్కార్ వేదికపైన నాటు నాటు అంటూ లైవ్‌గా పెర్ఫార్మ్ చేసి దుమ్ముదులపనున్నారు. అయితే రీసెంట్గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఆస్కార్ వేడకల్లో నాటు నాటు అంటూ డ్యాన్స్ చేయనున్నాడని ,తన పెర్ఫార్మెన్స్తో ఫిదా చేస్తాడని ఫ్యాన్స్ ఊహించారు. కానీ అలాంటిదేమీ లేదని ఎన్టీఆర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశాడు.
ఈ నెల 13న లాస్ ఏంజిల్స్‌లో ఆస్కార్ వేడుకలు అంగరంగవైభవంగా జరుగనున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ టీమ్ యూస్ లో సందడి చేస్తోంది. తారక్ కూడా రీసెంట్గా లాసేంజిల్స్కు చేరుకున్నాడు. తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేయడంతో పాటు మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. అభిమాన తారలంతా తరలిరావడంతో తెలుగు సినిమా ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ చేసుకుంటున్నారు. రెడ్ కార్పెట్‍పైన తమ ఫేవరేట్ హీరోలు నడిచే రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రెడ్ కార్పెట్‌పై నడిచే విషయం గురిచి ఓ ఇంటర్వ్యూలో తారక్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.” రెడ్ కార్పెట్‌పై నడిచేది తారక్ లేదా రామ్ లేదా రాజమౌళీ కాదు, మేమంతా ఇండియాను రిప్రజెంట్ చేస్తున్నాము, ఆ క్షణం కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను. నాటు నాటు పాటను లైవ్‌లో వింటే ఎవరికైనా ఊపు వస్తుంది, ఎవరైనా ఆడాల్సిందే, నాకాళ్లు ఆడతాయి కానీ వేదికపై కాదు. ఈ పాటకు నేను రామ్ డ్యాన్స్ చేస్తామా అంటే కచ్చితంగా చెప్పలేను, ఎందుకంటే ఇద్దరం రిహార్సల్ చేయలేదు. ఆందుకే మేము ఆస్కార్ వేదికపై పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాం. ఆర్ఆర్ఆర్ను ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదలు అంటూ ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపాడు.