#RRR స్టోరీ‌లైన్ రివీల్ చేసిన రాజమౌళి - MicTv.in - Telugu News
mictv telugu

#RRR స్టోరీ‌లైన్ రివీల్ చేసిన రాజమౌళి

March 14, 2019

రాజమౌళి తన తరువాతి చిత్రం గురించి ప్రేక్షకులతో పంచుకోవడానికి ఈరోజు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్‌మీట్‌లో రామ్ చరణ్-జూనియర్ ఎన్టీఆర్‌లతో తెరకెక్కిస్తున్న చిత్రం కథ గురించి వివరించారు.

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. తాను చిన్నతనం నుంచి కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల జీవిత కథలతో స్ఫూర్తి పొందానని తెలిపారు. వారి జీవితాలతో ఆధారంగా అల్లుకున్న కల్పిత కథతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నానని తెలిపారు.

 

ఈ చిత్రం 1920 వ దశకంలో జరుగుంతుందని తెలిపారు. ఈ చిత్రాన్ని దాదాపు 350 నుంచి 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నానని నిర్మాత డీవీవీ దానయ్య తెలిపారు. ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడిగా బాలీవుడ్ నటి అలియా భట్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కు జోడిగా ఇంగ్లీష్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్ నటిస్తున్నారు. అలాగే సహాయ నటులుగా తమిళనటుడు, దర్శకుడు సముద్రఖని, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటిస్తున్నారు. ఈ చిత్రం 2020 జులై 30 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు.