'ఆర్‌ఆర్‌ఆర్' రీలీజ్ డేట్ ఫైనల్.. ఈ నెలలోనే - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆర్‌ఆర్‌ఆర్’ రీలీజ్ డేట్ ఫైనల్.. ఈ నెలలోనే

March 10, 2022

rrrr

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’. దేశ వ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, కరోనా కేసులు పెరగడంతో మేకర్స్ సినిమాను వాయిదా వేశారు. దీంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ సందర్భంగా గురువారం ఈ చిత్రానికి సంబంధించిన ఆప్డేట్‌ను ట్వీటర్ వేదికగా చిత్రబృందం పంచుకుంది. మార్చి 25న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. అయితే విడుదల తేదీ దగ్గరపడుతున్నప్పటికీ ప్రమోషన్స్ మాత్రం ప్రారంభించలేదు. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాజమౌళి మరో స్పెషల్ సర్‌ప్రైజ్ రివీల్ చేశారు.

ఇంతకీ ఆ స్పెషల్ సర్ ప్రైజ్ ఏంటీ అనుకుంటున్నారా ? అదే ‘ఆర్ఆర్ఆర్’ సెలబ్రెషన్ యాంథమ్. ‘‘ట్రిపుల్ ఆర్ సర్‌ప్రైజింగ్ యాంథ‌మ్‌ను మార్చి 14న విడుద‌ల చేయ‌బోతున్నాం. నిజానికి ఈ సెల‌బ్రేష‌న్ యాంథ‌మ్‌తో ట్రిపుర్ సినిమా చివ‌ర‌లో ఉంచి.. ప్రేక్ష‌కుల‌ను స‌ర్‌ప్రైజ్ చేయాల‌ని భావించాం. కానీ ఎగ్జ‌యిట్‌మెంట్‌ను ఆపుకోలేక‌పోతున్నాం’’ అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. ఎత్తర జెండా అంటూ సాగే ఈ ట్రిపుల్‌ఆర్ సెలబ్రెషన్ యాంథమ్ మార్చి 14న రిలీజ్ కానుంది. ఈ సినిమాను తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ , తమిళ్ భాషలలో విడుదల చేయనున్న విషయం తెలిసిందే.