RRR star Ram Charan and wife Upasana Konidela dine with fans in Japan ahead of film’s release
mictv telugu

జపాన్‌లో మెగా పవర్ స్టార్ క్రేజ్.. రజినీకాంత్, ప్రభాస్ తరువాత రామ్ చరణే

October 19, 2022

 

RRR star Ram Charan and wife Upasana Konidela dine with fans in Japan ahead of film’s release
తెలుగు చిత్ర పరిశ్రమ సత్తాని ప్రపంచానికి తెలియజేసిన సినిమా ఆర్ఆర్ఆర్. బాహుబలితో మొదటిసారే ఈ విషయాన్నీ నిరూపించిన రాజమౌళి మరోసారి ఆర్ఆర్ఆర్‌తోను అదే మ్యాజిక్ చేశాడు. హాలీవుడ్ సైతం అదిరిపడేలా చేశాడు జక్కన్న. ఇప్పటికి ప్రతి ఒక్కరి నోటా ఆర్ఆర్ఆర్ వస్తుంటుంది. చరిత్రలో కలవని ఇద్దరు యోధులని స్నేహితులుగా ఆర్ఆర్ఆర్ లో రాజమౌళి మలిచిన తీరు అనిర్వచనీయం. ఆర్ఆర్ఆర్ ప్రతి సీన్ ఆడియన్స్‌తో చప్పట్లు కొట్టిస్తుంది. కరోనా లాంటి విపత్కర పరిసితులతో భయపడుతున్న జనాలని మళ్ళీ థియేటర్స్ కి పరుగులు పెట్టించింది ఆర్ఆర్ఆర్. హౌస్ ఫుల్ బోర్డులు కనిపించక స్తబ్ధుగా ఉన్న పలు ఇండస్ట్రీలని బ్రతికించిన సినిమా. ఆర్ఆర్ఆర్ స్ఫూర్తితోనే వరుసగా మళ్ళీ పాన్ ఇండియా సినిమాలు జోరందుకున్నాయి. ఈ సినిమాకి ఆస్కార్ కూడా ఖాయమంటూ ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్స్ చెప్తున్నాయి.

ఇక ఆర్ఆర్ఆర్ మన దేశ ప్రజలకే కాదు ఇప్పుడు వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి కూడా నచ్చేస్తుంది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్‌ని జపాన్ ప్రజలు తెగ ఆదరిస్తున్నారు. ఇప్పటికే జపాన్‌లో బాహుబలి బ్లాక్ బస్టర్ అయ్యింది. ప్రభాస్, రానాలకి పెద్ద సంఖ్యలో జపాన్ అభిమానులు ఉంటారు. వీరికంటే ముందు సూపర్ స్టార్ రజినీకాంత్ స్టైల్స్‌కి జపనీస్ పెద్ద ఫ్యాన్స్. అలాంటిది ఇప్పుడు రామ్ చరణ్‌కి కూడా జపాన్‌లో అదే మాదిరి క్రేజ్ కనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ తరువాత జపాన్‌లో పెరిగిన ఫ్యాన్ బేస్ కారణంగా.. తాజాగా జపాన్ లో ఫ్యాన్స్ ను కలిశారు రాంచరణ్. భార్య ఉపాసనతో చరణ్ అక్కడికి వెళ్లి ఫ్యాన్స్‌ను కలిశారు. వారితో కలిసి డిన్నర్ చేశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రజినీకాంత్, ప్రభాస్ తర్వాత చరణ్ కు ఆ రెంజ్ ఫాలోయింగ్ రావడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చరణ్.. శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.