rrr-team-reached-hyderabad
mictv telugu

ఆర్ఆర్ఆర్ టీమ్ హైదరాబాద్ వచ్చేసింది

March 17, 2023

 rrr-team-reached-hyderabad

ఆస్కార్ అవార్డ్ అందుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్ హైదరాబాద్ చేరుకుంది. అమెరికాలో పార్టీలు, సంబరాలు ముగించుకుని ఈరోజు తెల్లవారు ఝామున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు రాజమౌళి, రమ, కీరవాణి, వల్లి, కార్తికేయ, కాలభైరవ, శ్రీసింహ తదితరులు. ఎయిర్ పోర్ట్ లో వీరికి ఘన స్వాగతం లభించింది. రాజమౌళి, కీరవాణిలతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ కీరవాణి, రాజమౌళిలు ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చారు.

రాజమౌళి అండ్ టీమ్ తో మాట్లాడేందుకు మీడియా ప్రయత్నించింది. కానీ రాజమౌళి వారికి అవకాశం ఇవ్వకుండా జైహింద్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది.

మరోవైపు రామ్ చరణ్ కూడా ఈరోజే హైదరాబాద్ చేరుకోనున్నారు. అయితే ఆయన నేరుగా హైదరాబాద్ రావడం లేదు. ముందు ఢిల్లీలో దిగి, సాయంత్రం ఇండియా టుడే కాన్ క్లేవ్ లో పాల్గొని వస్తారు. దీంతో పాటు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో కూడా చరణ్ సమావేశం కానున్నారు. అదయ్యాక చరణ్ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. చరణ్ కు ఘనంగా స్వాగతం పలికేందుకు అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు.