టాలీవుడ్లో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా శుక్రవారం (రేపు) ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమాను మొదటిరోజు మొదటి షోను థియేటర్స్‌కి వెళ్లి చూడాలని ఇటు రాంచరణ్ ఫ్యాన్స్, అటు జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ టికెట్ల కోసం తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలో ఒక్కో టికెట్ ధర 2,000 నుంచి 5,000 వేల వరకు పలుకుతుంది. అయినా సరే కొనడానికి ఫ్యాన్స్ మాత్రం వెనకాడటం లేదు. ఇప్పటికే ఈ టికెట్లకు సంబంధించి నాలుగు రోజుల ముందే సందండి మొదలైంది. సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా థియేటర్స్ వద్ధ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు.
మరోపక్క అభిమానులు తారక్ , రాంచరణ్, రాజమౌళిల భారీ కటౌట్లను, ఫ్లక్సీలను ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాలలో థియేటర్ కనిపించినంతగా ఫ్లెక్సీలతో నింపేశారు. మరోవైపు చరణ్, తారక్ పర్ఫామెన్స్ సినిమాను తారాస్థాయిలో నిలిబెడుతుందని రాజమౌళి ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. దీంతో అభిమానుల్లో తెలియని అభిమానం ఉప్పొంగి టికెట్ల కోసం ఎగబడుతున్నారు. ఈ సినిమాను 60 దేశాల్లో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
అంతేకాకుండా సినిమాను ఐదు భాషల్లో 2డీ, 3డీ ఐమాక్స్ ఫార్మాట్లలో విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని థియేటర్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కానుంది. దీంతో అభిమానులు మొదటి రోజే సినిమా చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆన్లైన్ బుకింగ్స్ ఫుల్ అయిపోయాయి. ఇక బెనిఫిట్ షో టికెట్స్ కోసం అభిమానులు పోటీపడుతుండగా.. సినిమా టికెట్స్‌కు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఒక్కో టికెట్టు ధర. 2,000 వేల రూపాయల నుంచి 5,000 వేల వరకు పలుకుతుంది. అయినా అభిమానులు వెనుకాడటం లేదు అంటే సినిమా క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్ధమవుతుంది.