ఆర్బీవీఆరార్ ఫౌండేషన్ కు 10 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్బీవీఆరార్ ఫౌండేషన్ కు 10 కోట్లు

August 22, 2017

విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఆర్బీవీఆరార్ ఫౌండేషన్ కు తెలంగాణ ప్రభుత్వం పెద్ద చేయూతనిచ్చింది. ఫౌండేషన్ కు రూ. 10 కోట్ల నిధులు కేటాయించింది. రాజేంద్రనగర్ బుద్వేల్ లో విద్యా సంస్థ భవన నిర్మాణం కోసం ఈ మొత్తాన్ని కేటాయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ప్రత్యేక నిధి కింద ఈ నిధులను కేటాయించారు.

అబిడ్స్ లోని రాజా బహదూర్ వెంకటరామారెడ్డి (ఆర్బీవీఆరార్) కొన్ని దశాబ్దాలుగా రెడ్డి సామాజిక వర్గ విద్యార్థులకు పలురకాల సాయం చేస్తోంది. కాలేజీలను కూడా నిర్వహిస్తోంది.