‘అసని’ తుపాన్‌తో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కాసేపటి క్రితమే జగన్ మోహన్ రెడ్డి జిల్లాల కలెక్టర్లతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో పలు సహాయక చర్యలపై చర్చలు జరిపారు. జగన్ మాట్లాడుతూ..” ఇప్పటికే తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను జిల్లాలకు పంపించాం. అధికారులు హై అలర్ట్‌గా ఉండాలి. ఇప్పటికే నిధులు కూడా ఇచ్చాం. తుపాను తీరం వెంబడి ప్రయాణిస్తోంది. కాబట్టి తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తం అవసరం. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. అవసరమైన చోట సహాయ, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయండి. సహాయ శిబిరాలకు తరలించిన వ్యక్తికి రూ. 1000, కుటుంబానికి రూ.2 వేల చొప్పున ఇవ్వండి” అని అని జగన్ అన్నారు.
మరోపక్క ‘అసని’ తుపాన్ కారణంగా రాష్ట్రంలోని 9 జిల్లాలో కంట్రోలు రూమ్‌లను అధికారులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ తుపాను వల్ల పండ్ల తోటలు, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. తీరంలోని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో బుధవారం జగన్ మోహన్ రెడ్డి వ్యక్తికి రూ. 1000, కుటుంబానికి రూ.2 మరో నిర్ణయం తీసుకున్నారు.