టాలీవుడ్ దర్శకుడు మారుతి ‘పక్కా కమర్షియల్’ సినిమా విషయంలో వేగం పెంచేశారు. మొదటి నుంచి సినిమా విషయంలో ప్రమోషన్స్‌ను వెరైటీగా ప్లాన్ చేసి, ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నారు. ఈ క్రమంలో పక్కా కమర్షియల్ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడడంతో టికెట్ల విషయంపై ప్రేక్షకులకు అవగాహన కల్పించడానికి చిత్ర బృందం తాజాగా ఓ కొత్త క్రియేటివిటీతో ఓ వీడియోను విడుదల చేసింది.
ఆ వీడియోలో.. కమెడియన్ సప్తగిరి ఒక థియేటర్లో పక్కా కమర్షియల్ సినిమా టికెట్లను బ్లాక్‌లో అమ్ముతున్నాడు. రూ. 150లకే పక్కా కమర్షియల్ టికెట్లు రండి బాబు, రండి అంటూ అమ్ముతున్నాడు. దాంతో ఓ ఇద్దరు వ్యక్తులు మారుతి వద్దకు అతనని తీసుకొచ్చారు. టికెట్స్ బ్లాక్‌లో ఎందుకు అమ్ముతున్నావు అని అడుగగా, సినిమాల్లోకి రాకముందు నేను బ్లాక్ టికెట్స్ అమ్ముకొనేవాడినని సప్తగిరి చెప్పాడు. ఇక, టికెట్స్ రూ. 150 అమ్ముతున్నానని సప్తగిరి చెప్పగా, కౌంటర్లో కూడా రూ. 150కే అమ్ముతున్నారు అని మారుతి చెప్పడంతో సప్తగిరి షాక్ అయ్యాడు.
అనంతరం డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. పక్కా కమర్షియల్ సినిమా టికెట్లను పాతరేటు ప్రకారమే అమ్ముతున్నామని, సామాన్య ప్రజలు తమ కుటుంబ సభ్యులతో థియేటర్లకు వచ్చి సినిమాను వీక్షించాలని కోరారు. సినిమా టికెట్‌ను ప్రతి సామాన్యుడు కొనేలా రూ.100 నుంచి రూ. 150కే విక్రయిస్తున్నామని అన్నారు. గ్రూప్‌లుగా మీ స్నేహితులతో వచ్చి సినిమాను ఎంజాయ్ చేయాలని విజ్జప్తి చేశాడు.